ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంకాలనీలలో అభివృద్ధి డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

కాలనీలలో అభివృద్ధి డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

కాలనీ, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముగింపు పలికి భవిష్యత్తులో డ్రైనేజీ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి పనులు నిరాటకంగా కొనసాగిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ సర్కిల్ 57వ డివిజన్ నాదర్ గూల్, అల్మాస్ గూడ ప్రాంతంలోని స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఆమె సావధానంగా విని కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గతంలో కార్పొరేటర్ల సమన్వయంతో ప్రారంభమైన కొన్ని అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయిన నేపథ్యంలో వాటిని తిరిగి పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. గత సంవత్సరం కాలంగా స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం ప్రాంతాల్లో డ్రైనేజ్ నీరు రోడ్లపైనే ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గతంలో ప్రతిపాదించిన ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను మళ్లీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పనులకు పరిపాలనా అనుమతులు తీసుకుని టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు. దాదాపు ఏడాది నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముగింపు పలికి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను కూడా అప్‌గ్రేడ్ చేసి వర్షపు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గతంలో తీర్మానించిన కొన్ని అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయిన నేపథ్యంలో కమిషనర్‌తో చర్చించి వాటిని తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రైనేజ్, రోడ్లు తదితర పనులకు బడ్జెట్ విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. దాదాపు 800 అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారని, నివేదికలు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా – శాశ్వత పరిష్కారాలే మా లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, రామిడి రామిరెడ్డి, అర్కల కామేష్ రెడ్డి, ముత్యాల కృష్ణ, ఏనుగు రామిరెడ్డి, తుఫాన్ రెడ్డి, ముత్యం రెడ్డి, సత్తిరెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటగిరి జంగయ్య, మహిళా నాయకురాళ్లు గీత, జాలే సరితా రెడ్డి, ఆకుల సరిత, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!