జై తెలంగాణ, జై బీజేపీ, జై మోడీ
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాపూర్ మండలం, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 62వ వార్డులో భారతీయ జనతా పార్టీ బడంగ్‌పేట్ క్లస్టర్ ఉపాధ్యక్షుడు క్యారగారి అరవింద్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కోపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతీయ జనతా పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేసి, తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచిన కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా అందించిన మద్దతును వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల ఉపాధ్యక్షుడు ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్ , బీజేపీ ప్రధాన కార్యదర్శి రావుల మల్లేష్ , బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు జోరాల ప్రభాకర్, బీజేపీ ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గుండె నాగార్జున బాబు, మాజీ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొంతం సంపత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, మునగాల ప్రభాకర్ రెడ్డి, గడ్డం భాను తేజ, ధనరాజు, ఆనంద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

