ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంచందనం చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం ప్రారంభించిన అధికారులు

చందనం చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం ప్రారంభించిన అధికారులు

📰 Generate e-Paper Clip

జిల్లెలగూడ పరిసర ప్రాంతాల ప్రజలు ఇక ఊపిరి పీల్చుకోండి

ఇక దోమల బెడద తప్పినట్లేనని

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

జీహెచ్ఎంసీ పరిధిలోని చందన చెరువులో గుర్రపు డెక్క పూర్తిగా నిండిపోవడంతో దోమల బెడద తీవ్రమైంది. స్థానికంగా దోమలు స్వైర విహారం చేయడంతో ఇక్కడి ప్రజలు బెజారయ్యారు. దోమలు విపరీతంగా పెరిగిపోయి స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దోమకాటుకు గురై ప్రజలు రోగాలబారిన పడుతున్నా పట్టించుకునేవారే లేరని జిల్లెలగూడ వాసులు మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజలకు హాని చేసే దోమలను నివారించేందుకు సంబంధిత శాఖాధికారులు నిర్లక్ష్యం వహించారు. స్థానికంగా గత కొంతకాలంగా దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయడం లేదని, అంతేగాక దోమల నివారణకు మందును కూడా పిచికారి చేయడంలేదని, గుర్రపు డెక్కను తొలగించాలని ఒకవైపు బీజేపీ నాయకులు మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

చెరువులో గుర్రపు డెక్కను తీసి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా చెరువులో గుర్రపు డెక్కను తీసేందుకు గత 3 రోజుల క్రితం పనులు ప్రారంభించారు. అట్టి పనులు సోమవారం చెరువులో గుర్రపుడెక్కరు తీసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా దోమలతో ఇబ్బంది పడ్డ తాము ఇక గుర్రపు డెక్క తొలగింపుతో దోమల సమస్య తీరనుందని జిల్లెలగూడ పరిసర ప్రాంత ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!