ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిజల్ పల్లి లో గ్యాస్ ప్లాంట్ లో బ్లాస్ట్. భయాందోళనకు గురైన జల్ పల్లి వాసులు

జల్ పల్లి లో గ్యాస్ ప్లాంట్ లో బ్లాస్ట్. భయాందోళనకు గురైన జల్ పల్లి వాసులు

📰 Generate e-Paper Clip

ప్లాంట్లో పని చేస్తున్న ఇద్దరికీ సమీపంలో ఉన్న కార్ షెడ్ లో పని చేస్తున్న ఇద్దరికీ గాయాలు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

జల్ పల్లి లో హాస్పిటల్ కు సరఫరా చేసే గ్యాస్ ప్లాంట్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన లారీలు, గ్యాస్ సరఫరా చేసే ఆటోలు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. అందులో పనిచేస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగింది. భయాందోళనకు గురైన జల్ పల్లి పరిసర వాసులు పరుగులు తీశారు.

జల్ పల్లి గ్రామం లో ఎన్నో కంపెనీలు అక్రమంగా వెలుస్తున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని కంపెనీలు నడిపిస్తున్నారు. గ్యాస్ కు సంబంధించి లైఫ్ కేర్ మెడికల్ అండ్ ఇండస్రీయల్ ఎయిర్ ప్రొడక్ట్స్ పేరుతో నడుపుతున్నాడు. ఇది లీగల్ ఆ లేదా ఇల్లీగల్ ఆ అని తెలియాల్సి ఉంది. ప్రతి కంటైనర్ లలో ఆక్సిజన్ వస్తుంది. వాటిని చిన్న వాటిలో నింపి హాస్పిటల్, ఇతర సంస్థలకు పంపటం జరుగుతుంది . సోమవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతం లో ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్ లో బ్లాస్ట్ జరిగింది. దానితో చుట్టు ప్రక్కల ఉన్న కంపెనీ ల వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ప్రక్కనే కార్ల షెడ్డు లోనున్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. గ్యాస్ కంపెనీ లో పని చేసే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి . స్థానికుల సమాచారం మేరకు పహాడీషరీఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు, పోలీసులు మాట్లాడుతూ.. జల్ పల్లి లో జరిగిన విషయం తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నామని, గ్యాస్ ప్లాంట్ బ్లాస్ట్ లో నలుగురికి గాయాలు అయ్యాయని,  వారిని హాస్పిటల్ కు తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!