ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్జిల్లెలగూడలో తార్ కారు బీభత్సం

జిల్లెలగూడలో తార్ కారు బీభత్సం

📰 Generate e-Paper Clip

పాలు పంపిణీ చేస్తున్న ఓకే ఇంటికి చెందిన ఇద్దరి అన్నదమ్ములకు తీవ్ర గాయాలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

మద్యం మత్తులో తార్ కారును అతి వేగంగా నడపడంతో బీభత్సం సృష్టించింది. ఈ సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దాసరి నారాయణ కాలనీలో ఉదయం చోటు చేసుకుంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడా స్వాగత్ గ్రాండ్ హోటల్ ఎదురుగా, శ్రీ మణికంఠ జనరల్ స్టోర్ సమీపం (గల్లీ)లో గల శ్రీహర్ష సారీ సెంటర్ వద్ద శనివారం ఉదయం 6 గంటలకు మద్యం మత్తులో తార్ మహేంద్ర కారు స్కూటీపై ఇంటింటికి పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు అఖిలేశ్వర్ (22), విగ్నేశ్వర్ (16) లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. టీజీ 08 ఎ 7887 నంబర్ గల మహేంద్ర తార్ వాహనం మిథిలా నగర్ నుంచి స్వాగత్ గ్రాండ్ వైపు వస్తుందిి. స్వాగత్ గ్రాండ్ నుంచి ఇంటింటికి పాల ప్యాకెట్లు పంపిణీ చేయడానికి టీఎస్ 08 ఈఎస్ 4771 స్కూటీపై మిథిలా నగర్ వైపు ఇద్దరు అన్నదమ్ములు వెళ్తున్నారు. మహీంద్రా తార్ కారు డ్రైవర్ మద్యం మత్తులో స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి అవతల పడ్డారు.

మహీంద్రా కారు అదే స్పీడ్ లో వెళ్లి శ్రీహర్ష సారీ సెంటర్ మొదటి మెట్టు పైకి ఎక్కింది. దీంతో అక్కడే ఆగిపోయింది. స్కూటీ కారు కిందికి మధ్యలోకి వెళ్ళి ఇరుక్కుపోయింది. షాపు లేకపోతే ఇద్దరి అన్నదమ్ముల మీద నుంచి వెళ్లిపోయేది. కారులో రెండు బీరు బాటిల్లు అలాగే ఉన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తూ మద్యం సేవించి వాహనం నడిపినట్లు సమాచారం. కారులో 2 బీర్ బాటిళ్ళు ఉన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!