జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ రచ్చ రఘు ఘన విజయం
జిల్లా అధ్యక్షునిగా 2 సంవత్సరాల పాటు కొనసాగింపు
మన తొలివెలుగు : నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీ జీడీఏ) గుర్తింపు పొందిన సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన జిల్లా ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి,రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి గారి మార్గదర్శకత్వంలో, జిల్లా స్థాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. రాజేష్ గౌడ్ సమర్థంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల,ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రిలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్‌కు చెందిన ప్రభుత్వ వైద్యులు కలిపి మొత్తం 70 మంది ఓటర్లలో 60 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 2 ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి.
ఓట్లఫలితాలు
డాక్టర్ రచ్చ రఘు –31 ఓట్లు, సమీప ప్రత్యర్థి డాక్టర్ శేఖర్–27 ఓట్లు, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్, జనరల్ సర్జన్ & విభాగాధిపతి డాక్టర్ రచ్చ రఘు గెలుపొందారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎస్.రాజేష్ గౌడ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ.. నాపై విశ్వాసం ఉంచి అత్యధిక ఓట్లతో గెలిపించిన ప్రతి సహచర వైద్యుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ప్రభుత్వ వైద్యుల హక్కులు, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తాను.జిల్లాలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగు పర్చేందుకు నిరంతరం కృషి చేస్తాను” అని తెలిపారు.ఈ ఎన్నికలతో జిల్లాలో ప్రభుత్వ వైద్యుల ఐక్యత మరింత బలపడటంతో పాటు, వారి సమస్యల పరిష్కారానికి బలమైన వేదిక ఏర్పడిందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ డాక్టర్ల జిల్లా అధ్యక్షునిగా రెండు సంవత్సరాలపాటు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తానని అన్నారు.
