అసలు అధికారులు ఉన్నట్టా లేనట్లా ప్రజల సమస్యలు పట్టించుకోని అధికారులు.. అసలు మనుషులేనా
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ , హర్షగూడ ప్రాంతాలలో నీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. వేసవికాలంలో మండుటెండలో నీటికి ఇబ్బంది పడుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని అధికారులు నిద్రపోతున్నారా లేక ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం పట్ల హర్షగూడ బీజేపీ సీనియర్ నాయకుడు రవి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలరోజుల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ ఫేస్ బోర్లు రిపేరు చేయిస్తామని తీసుకెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు నెల రోజులు దాటుతున్న ఇప్పటివరకు బోర్లు రిపేర్ చేయించి తీసుకొచ్చి ఫిటింగ్ చేయలేదని వాటర్ లేక ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న జీహెచ్ఎంసీ అధికారులకు కనికరం లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నెలరోజుల నుండి వాటర్ లేకుండా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కనీసం జీహెచ్ఎంసీ అధికారులు అర్థం చేసుకోకపోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని కనీసం వాటర్ సమస్య కూడా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులు కమిషనర్ స్పందించి సమస్యలను పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రవి నాయక్ హెచ్చరించారు. అధికారులు నిద్రపోతున్నారా లేక ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెలరోజుల నుండి అధికారులు వాటర్ సమస్యను పరిష్కారం చేయకపోతే అనేక సమస్యలను ఎలా పరిష్కారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ నుండి జీహెచ్ఎంసీ మారిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పట్టించుకునే నాధుడే లేకున్నా పోయాడని మున్సిపల్ ఉన్నప్పుడు కనీసం కౌన్సిలర్ ని అక్కడ ఉన్న అధికారులను అడిగి పనిచేయుచుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు అక్కడ అధికారులు లేరు ఎవరిని అడగాలో తెలియదు శంషాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి అడిగే పరిస్థితుల ప్రజలు అడగలేని పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని రవి నాయక్ కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు.

