మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పేదలకు సొంతింటి కల నెర వేరడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ తెలిపారు. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో జ్ఞానాది రమ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. నిర్మాణం కోసం కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ జనార్ధన్ గౌడ్ లతో కలిసి ముగ్గుపోసి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిని గోపాల్ రెడ్డి,అరటి కుమార్, శ్రీనివాస్ చారి, వినయ్ చారి, పరమేష్ చారి, ప్రభాకర్, నాయకుడు బక్కని రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
