ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  

బడంగ్ పేట సర్కిల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. బడంగ్‌పేట్ సర్కిల్-16 పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య మీర్‌పేట్ ప్రభుత్వ మైదానాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. మైదానంలో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం నాదర్‌గుల్ ప్రాంతంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి, పనుల నాణ్యత, పురోగతినిళ తెలుసుకున్నారు. పనులు సమయానికి పూర్తిచేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి కుర్మల్‌గూడలోని జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం భవనాలను సందర్శించి, అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నివాస సదుపాయాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను గమనించి, వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ అభినయ్ కుమార్, ఏఎంహెచ్ఓ డా. ప్రవీణ్, ఏఈ గంగాప్రసాద్, ఏ.ఈ హరీష్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!