ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంప్రాపర్టీ టాక్సీలు తగ్గించండి అంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి

ప్రాపర్టీ టాక్సీలు తగ్గించండి అంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విపరీతంగా పెరిగిన ప్రాపర్టీ టాక్సీలపై వివిధ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు అనుగుణంగా టాక్సీల విధానం ఉండాలని, ప్రస్తుతం మీర్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్‌లో అధికంగా టాక్సీలు వసూలు చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్న విధానాన్నే తమ ప్రాంతంలో కూడా అమలు చేయాలని వారు ఎమ్మెల్యే ని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రాపర్టీ టాక్సీల సమస్యపై జీహెచ్ఎంసీ కమిషనర్‌తో చర్చించి, జీహెచ్ఎంసీ పరిధిలో అమలులో ఉన్న విధానాన్ని మీర్‌పేట్ ప్రాంతంలో కూడా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అరకల కామేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల బీరప్ప, దీప్లాల్ చౌహాన్, సునీత బాలరాజ్, సిద్దాల పెద్ద బీరప్ప, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!