ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeమహేశ్వరంబాలాపూర్ లో బీజేపీ రాస్తారోకో

బాలాపూర్ లో బీజేపీ రాస్తారోకో

📰 Generate e-Paper Clip

ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు సమయానికి వెళ్లలేకపోతున్నారు రద్దీ పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి 

ఆర్.సీ.ఐ రోడ్డు నుండి పహాడీషరీఫ్ వరకు భారీగా నిలిచిపోయిన వాహనాలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ఆర్.సీ.ఐ నుండి పహాడీషరీఫ్ వరకు 4 లైన్ల రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా పని ప్రారంబించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కో – ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్.సీ.ఐ నుండి పహాడీషరీఫ్ వరకు ఫోర్ లైన్స్ రోడ్ పనులు ప్రారంభించి నేటికి 2 ఏండ్లు పూర్తయినా కూడా పని ప్రారంబించలేని సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి శిలా ఫలకానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు సమయానికి వెళ్లలేకపోతున్నారని, రద్దీ పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు అభివృద్ధి పనులు ఇప్పటివరకు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చొరవ తీసుకొని త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!