ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్భవన నిర్మాణ కార్మికుల శ్రమకు గుర్తింపునివ్వాలి 

భవన నిర్మాణ కార్మికుల శ్రమకు గుర్తింపునివ్వాలి 

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్, సుభాష్ నగర్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు, నిర్మాణ వ్యయంతో పాటు భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల శ్రమను గుర్తించి పనికి తగ్గ వేతనాన్ని అందించాలని తెలిపారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ సుభాష్ నగర్ కమిటీ అధ్యక్షులు పి. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పి. వెంకయ్య, సెక్రటరీ వి. శ్రీనివాస్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!