సత్యసాయి నగర్ కాలనీ లో నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పగిలిన మంచినీటి పైప్ లైన్
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
జీహెచ్ఎంసీ, మీర్ పేట్- 60 డివిజన్ సత్యసాయి నగర్ కాలనీలో నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో కాలనీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీ వాసులు నీళ్ల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా మంచినీటి సమస్యకి పరిష్కారం ఆలోచించి కాలనీ వాసులకు త్రాగునీరు సదుపాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీర్ పేట బీజేపీ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్, కాలనీవాసులు అధికారులను కోరారు. సత్యసాయి నగర్ లో ఆయన నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీర్ పేట్ డివిజన్ లో ప్రతి సంవత్సరం వరద నీరు వలన కాలనీలు మునిగిపోతున్న సంగతి అందరికి తెలిసిందే అన్నారు. మరి ముఖ్యంగా మిథిలా నగర్ కాలనీ, శ్రీ సత్యసాయి నగర్ కాలనీ లో వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం మొత్తానికి ఎస్.ఎన్.డీ.పీ నాల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్.ఎన్.డీ.పీ నాల కోసం తవ్వకాలలో భాగంగా శ్రీ సత్యసాయి నగర్ కి త్రాగునీరు వచ్చే పైప్ లైన్ పగిలిపోడం వల్ల గత 4, 5 రోజులుగా త్రాగునీరు లేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి సిబ్బంది దృష్టి కి తీసుకెళ్లగా, ఎస్.ఎన్.డీ.పీ నాలా పూర్తి అయ్యేంత వరకు త్రాగునీరు సదుపాయం కష్టమని, కనీసం దీనికి 2 నెలలు పడుతుందని సిబ్బంది చెప్పిన సమాధానం విని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాలనీలో చాలా వరకు కాలనీ వాసులు ఇంట్లో బోర్లు లేక కేవలం పైప్ లైన్ ద్వారా అందించే త్రాగునీరు సదుపాయం పైన ఆధారపడి ఉన్నారని తెలిపారు. 2 నెలలు వరకు త్రాగునీరు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బందంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి అధికారులు ఈ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా ఈ సమస్య కి పరిష్కారం ఆలోచించి కాలనీ వాసులకు త్రాగు నీరు సదుపాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

