లారీల కొరత నివారించే ట్రాక్టర్ల ద్వారా రవాణాకు అవకాశం ఇవ్వాలి
తరువు పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అదనంగా తూకం వేయడానికి నిషేధించాలి
కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు మంచినీళ్లు, నీడ కోసం టెంట్లు వేయాలి
సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ కు జిల్లాలో కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ.. జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రాలు కేవలం 15 మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా ఐదు మండలాలలో కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి సొంత మండలం వంగూరులో కూడా కొనుగోలు కేంద్రం లేదని, జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను కోరారు. అదే విధంగా జిల్లాలో గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని బ్యాగులు లేక రైతులు బ్లాక్ మార్కెట్లో బస్తా ఒకటికి 30 రూపాయలు చొప్పున అదనంగా కొనుగోలు చేసుకుంటున్నారని దీని ద్వారా రైతులు నష్టపోతున్నారని రైతులకు బస్తా రేటు కట్టించాలని డిమాండ్ చేశారు. తూకం చేసిన బస్తాలు ఆయా కేంద్రాలలోనే రోజుల తరబడి ఉండడం వల్ల రైతులు బస్తాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందని, వర్షం వస్తే పూర్తిగా నీటి మయమవుతున్నాయని, రైతులందరికీ కవర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. లారీల కొరతను నివారించడానికి ట్రాక్టర్స్ ద్వారా రైతులకు రవాణాకు అవకాశం కల్పించాలని, రవాణా ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తరువు పేరుతో కొనుగోలు కేంద్రంలో 50 కేజీలకు అదనంగా ఒక కిలో 500 గ్రాముల వరకు తూకం చేస్తున్నారని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని 50 కేజీలకే తూకం వేయాలని అదనంగా తూకం వేస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీసం మంచినీళ్లు కనీస సౌకర్యాలు కూడా లేవని, ఎండలో టెంట్లు వేయకుండా రైతులను తీవ్రంగా ఇబ్బందుల గురి చేస్తున్నారని వెంటనే కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ 50 కేజీలకు అదనంగా 5 కిలోలు తీసుకుంటున్నారని దోపిడీ జరుగుతున్న.. అధికారులు ఏమాత్రం పట్టకుండా ఉంటున్నారని అదనంగా తీసుకుంటున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్ 4 నుండి జిల్లాలో కొనుగోలు ప్రారంభమైన నేటి వరకు రైతులకు డబ్బులు చెల్లించలేదని వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందికొండ గీత, జిల్లా కమిటీ సభ్యులు పొదిలి రామయ్య, శివవర్మ, అశోకు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.

