ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంమేస్త్రి పని చేసే వ్యక్తి అదృశ్యం 

మేస్త్రి పని చేసే వ్యక్తి అదృశ్యం 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగాల గ్రామం, అచ్చంపేట్ మండలం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దర్శనం రేణుకకు బంగారయ్యతో వివాహం జరిగింది. పది సంవత్సరాల క్రితం వారు కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంఖాల్ గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు. భర్త బంగారయ్య (48)మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈ నెల 21 న 3 గంటల సమయంలో వారి పెద్ద కుమారుడు పనిచేస్తున్న కందుకూరుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆమె భర్త బైక్ టీజీ 31 3091 పై బయటకు వెళ్ళాడు. కానీ భర్త రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు . ఆమె భర్త ఫోన్ నంబర్ 9505611847 కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అతని స్నేహితుల, కుటుంబ సభ్యుల ఇండ్లలో, పలు ప్రాంతాలలో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో అతని భార్య పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!