ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక అదృష్టం

ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక అదృష్టం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక అదృష్టమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్ద లింగం (43) పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో నివాసం ఉంటూ డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మే 23 న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో అతని కుమార్తె తనుప్రీ (17) కిరాణా దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు. ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుండ్రని ముఖం, తెల్లటి వర్ణం, సుమారు 5 అడుగుల ఎత్తు, హిందీ, కన్నడ, మరాఠీ భాషలు మాత్రమే మాట్లాడగలదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు నీలం రంగు ప్యాంట్, క్రీమ్ రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!