మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ :
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘పీ ఎస్ ఆర్ క్లినిక్’ బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మందుల సామెల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) మాజీ ఉపాధ్యక్షులు, హాస్పిటల్ అధినేత పైళ్ళ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపి పైళ్ళ నేతృత్వంలో ఈ క్లినిక్‌ను ప్రజల చెంతకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ.. మోత్కూరు మరియు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ క్లినిక్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేదలకు అందుబాటు ధరల్లో, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని క్లినిక్ నిర్వాహకులకు, వైద్యులకు వారు సూచించారు.రాజకీయాలతో పాటు సమాజ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు పైళ్ళ సోమిరెడ్డిని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్లు శ్రీకాంత్, వెంకటేష్, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, వైద్య సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

