ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeమహేశ్వరంమోదీ పాలన అద్భుతం - కొలను శంకర్ రెడ్డి 

మోదీ పాలన అద్భుతం – కొలను శంకర్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

అద్భుతమైన పాలనా సిద్ధాంతంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని మోదీ అంకితభావం, దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కో – ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. మోదీ పాలన భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం ప్రధానిగా పాలన సందర్బంగా బాలాపూర్ దేవాలయంలో మహాహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన అధ్యాయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4399 రోజుల సుదీర్ఘ ప్రజాసేవపై కొలను శంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, అత్యధిక కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక మైలురాయిపై బీజేపీ నాయకులు కొలను శంకర్ రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 జూన్ 10 నాటికి వరుసగా 4,399 రోజుల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం దేశ ప్రజలు ఆయన నాయకత్వంపై ఉంచిన అపార విశ్వాసానికి నిదర్శనమని కొలను శంకర్ రెడ్డి కొనియాడారు. దేశం గత 12 సంవత్సరాల మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అపూర్వమైన ప్రగతిని సాధించిందని శంకర్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఆర్థిక, డిజిటల్ విప్లవం, జన్ ధన్ యోజన ద్వారా పేదలకు ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ఇండియా, యూపీఐ ద్వారా ప్రపంచంలోనే అగ్రగామిగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, ప్రజా సంక్షేమం, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత ఆరోగ్య భద్రత, పీఎం ఆవాస్ యోజన ద్వారా సొంతింటి కల, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు. జీఎస్టీ అమలు, నూతన విద్యా విధానం, దేశ సార్వభౌమాధికారాన్ని చాటి చెప్పిన ఆర్టికల్ 370 రద్దు, సాధికారత, స్టార్టప్ ఇండియా ద్వారా యువతకు ఉపాధి, మహిళలు, రైతులు, పేదల ఆర్థిక, సామాజిక సాధికారతకు పెద్దపీట వేచారని వివరించారు. వికసిత భారత్ – 2047, ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతిని, దేశ గౌరవాన్ని మోదీ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొలను శంకర్ రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని అంకితభావం, దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారత మాతా సేవలో మోదీ శక్తిమంతమైన నాయకత్వం మరింత శక్తి దేవుడు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గడ్డం వెంకటేష్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దొడ్డి శ్రీశైలం, జోరల ప్రభాకర్, కల్లెం లక్ష్మారెడ్డి, మునగాల ప్రభాకర్ రెడ్డి , కొంతం సంపత్ రెడ్డి, రావుల మల్లేష్, పెద్దింటి సుధాకర్ రామిడి శేఖర్ రెడ్డి , రామాచారి సిరికొండ, కల్లెం మురళి రెడ్డి, నర్రె గోపాల్, మంగపతి నాయక్, కొంతం ప్రకాష్ రెడ్డి, క్యారాగరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!