ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డివిజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ అనాధ ఆశ్రయములో కేఎల్ఆర్ జన్మదిన వేడుకలు 

విజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ అనాధ ఆశ్రయములో కేఎల్ఆర్ జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

మన తొలి వెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

బడంగ్ పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని నాదర్ గుల్ విజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ అనాధ ఆశ్రయములో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనాధ ఆశ్రయము పిల్లలు, మహేశ్వరం నియోజకవర్గం ఐ ఎన్ టీ సీ కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ కేఎల్ఆర్ జన్మదిన సందర్భంగా అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. అనాధ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నడికుడి శివ మాట్లాడుతూ.. కేఎల్ఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజాసేవ కార్యక్రమంలో అందరికంటే ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్ర నవీన్ కుమార్, మహేశ్వరం మండలం ఎన్ఎస్ఈఐ నాయకులు కొండూరు గణేష్,నాగిరెడ్డిపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నడికుడ కార్తీక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ సోహెల్, తదిరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!