ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeమహేశ్వరంవివాహిత ఆదృశ్యం

వివాహిత ఆదృశ్యం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

కూతురు మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి తల్లి మందలించడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో విహిత మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృష్టమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సోహెల్ తెలిపిన వివరాల ప్రకారం.. సమ్రీన్ (21) అనే మహిళ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ నందు కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నది. ఈ మహిళకు దాదాపు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త జాబ్ నిమిత్తం ఇతర ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ మహిళ తల్లిదండ్రుల మధ్య ఉంటున్నది. ఇటీవల బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ ఆజం అనే వ్యక్తితో గత కొద్ది రోజుల నుంచి సన్నిహితంగా ఉంటుందని తెలియడంతో తన తల్లి రుకియా బేగం మందలించింది. దీంతో తేదీ గత నెల 24న ఉదయం 6 గంటలకు ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోపోయింది. పలుచోట్ల వెతికిన ఆమే ఆచూకీ లభించలేదు. తల్లి రుకియా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!