బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :
రాజీవ్ గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ ని ఆయన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజల సంక్షేమం మరియు కాలనీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని కమిటీ సభ్యులుకు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కుంచల అజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు టి. విక్రమ్, కోశాధికారి పి. సంపత్ రెడ్డి, కాలనీ ప్రముఖులు చింతకింది వెంకటేష్, మహిపాల్ రెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు వెంకటేష్ గౌడ్, రమేష్, సర్వన్, బ్రహ్మ, సుబ్బారావు, రాజేష్ కుమార్, సతీష్, టి. శ్రీనివాస్, అవినాష్, జి. రాజేందర్ రెడ్డి, సిహెచ్ అశోక్, ఎమ్. వేణుగోపాల్, షేక్ ముబిన్, టి. రవి కుమార్, ఫణీంద్ర, నవీన్, ఎన్. అవినాష్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

