ePaper
Monday, May 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్

ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య

అధికారంలోనైనా, ప్రతి పక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు సునీత బాలరాజు అన్నారు. మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమంలో భాగంగా సునితా బాలరాజు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ 58వ డివిజన్ ప్రశాంతి హిల్స్, నందిహిల్స్ చౌరస్తా లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పండుగ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో జలదృశ్యంలో బీఆర్‌ఎస్‌ పురుడుపోసుకున్నదన్నారు. 25 ఏండ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో 60 ఏండ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి సరికొత్త చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఏకైక పార్టీ అన్నారు. ఆత్మగౌరవ ప్రతీక.. ప్రజా ఉద్యమ పతాక. ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేయబడిన ఆకాంక్షల మధ్య 2001లో జల దృశ్యంలో గులాబీ జెండా పురుడు పోసుకున్నదన్నారు. పాతికేండ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది అని తెలిపారు. పోరాటంలో నైనా, పాలనలోనైనా తన పటిమను చూపిందన్నారు. అగాధాలు, అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. ఆ పతాకం తలవంచలేదన్నారు. ఎత్తిన పిడికిలి సడలనివ్వలేదన్నారు.. ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తియే బీఆర్ఎస్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!