ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిపదవ తరగతి ఫలితాల్లో లార్డ్స్ విద్యార్థుల విజయ దుందుభి

పదవ తరగతి ఫలితాల్లో లార్డ్స్ విద్యార్థుల విజయ దుందుభి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ ఘన విజయాన్ని సాధించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించి, విద్యా రంగంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాల్లో లార్డ్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్రగాములుగా నిలిచారు. బి. సహస్ర 589 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, పి. అక్షర 587, జి. ప్రవళిక 585, కె. సాయి కృతి 584, శెట్టిపల్లి అక్షిత్ 581 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచారు. కే. తేజస్విని, చింతల రోషిణి ఇద్దరూ 580 మార్కులు, జయవంశీ 579, హన్విత్ 577, జి. కార్తీక్ 576, కే. హాసిని 575 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 11 మంది విద్యార్థులు 575 పైగా మార్కులు, 52 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు, 150 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి లార్డ్స్ విద్యార్థుల కృషి, పట్టుదల, సమయ పాలనకు నిదర్శనంగా నిలిచారు. విద్యార్థుల విజయానికి వెనుక ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బంది నిరంతర శ్రమను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులలో విద్యపై ఆసక్తి పెంపొందించడంలో, సరైన మార్గదర్శకత్వం అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత, డీన్ సతీష్ కుమార్, అన్ని బ్రాంచ్‌ల ప్రిన్సిపల్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!