ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాఎంబీబీఎస్ పట్టా అందుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూతురు బీర్ల అరుంధతి   

ఎంబీబీఎస్ పట్టా అందుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూతురు బీర్ల అరుంధతి   

📰 Generate e-Paper Clip

భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ప్రజలకు వైద్య సేవలు అందచేస్తా – డాక్టర్ అరుంధతి

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి 

భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలు అందిస్తానని ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న బీర్ల అరుంధతి తెలిపారు. ప్రముఖ విద్యా సంస్థ అయిన కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కూతురు బీర్ల అరుంధతి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఘనంగా పట్టాభిషేకం వేడుక గ్రాడ్యుయేషన్ (కాన్వికేషన్) కార్యక్రమం ఇటీవల నిర్వహించబడింది. ఈ వేడుకలో కళాశాల ప్రిన్సిపల్, ఆధ్యాపకులు, అతిథులు పాల్గొని విద్యార్థులకు కృషిని అభినందించారు. ఆమెకు పట్టా ప్రధానం చేసిన సందర్భంగా వేదికపై అతిథుల చేతుల మీదగా సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ బీర్ల అరుంధతిని అభినందించారు. వైద్య విద్య పూర్తి చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఘన విజయంతో బీర్ల అరుంధతి.. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు గర్వకారణంగా నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!