ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాకార్మికుల హక్కులను హరిస్తున్న బీజేపీ 

కార్మికుల హక్కులను హరిస్తున్న బీజేపీ 

📰 Generate e-Paper Clip

నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై మేడే స్ఫూర్తితో పోరాడుదాం

తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

కార్పోరేట్ కంపెనీల యజమానులకు కార్మికుల శ్రమను దోచి పెట్టడానికి బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను అరిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ విమర్శించారు. మేడే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. శుక్రవారం పోచంపల్లిలో 140 వ మేడే ఉత్సవాల్లో భాగంగా సిఐటియు పోచంపల్లి మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుండి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించిన అందరం నిర్వహించిన సభా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ 1986 సంవత్సరంలో 20 గంటల పని దినానికి వ్యతిరేకంగా 8 గంటల పని కోసం చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం ఫలితంగానే 8 గంటల పనితో పాటు, కార్మికులకు సంబంధించిన అనేక హక్కులు, చట్టాలు కల్పించబడ్డాయని అన్నారు. ఆస్ఫూర్తినే నేడు ప్రపంచవ్యాప్తంగా మే 1న మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని తెలిపారు. కానీ కేంద్రంలోని బిజెపి అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడుదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కార్మికుల శ్రమను దోచిపెట్టడానికి 12 గంటల పనిని ముందుకు తెస్తున్నారని విమర్శించారు. మరోపక్క నాలుగు లేబర్ కోడ్స్, విబి- జి రామ్ జీ చట్టము, విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి కార్మికుల, కర్షకుల, వ్యవసాయ కూలీల, పేద ప్రజల బ్రతుకులతో చెలగాటమాడుతున్నారని ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలని సూచించారు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదంతో ఉద్యమించినప్పుడే మన హక్కులు కాపాడబడతాయని తెలిపారు. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేటుపరం చేస్తూ ఉన్న కాస్త ఉద్యోగాలను కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించిన. బిజెపి పాలనలో పేదోళ్లు మరింత పేదోళ్లుగా, ధనికులు మరింత ధనికులుగా మారుకున్నారని విమర్శించారు. గ్రామీణ స్థాయిలో కూడా నయా ధనిక వర్గం పుట్టుకొచ్చి గ్రామీణ పేదలను దోపిడీ చేస్తున్నారని ఉన్నారు. శ్రామిక వర్గం కార్మిక, కర్షక ఐక్యతతో శ్రామిక వర్గ రాజ్యాధికారం కోసం, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ సభా కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ప్రసాదం విష్ణు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బాక జగన్, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి పాల్గొని మాట్లాడగా ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బుగ్గ లక్ష్మయ్య, నెల్లికంటి జంగయ్య, కోట అశోక్, నోముల కృష్ణారెడ్డి, పోన్నమోని కృష్ణ, పుష్పలత నాయకులు చుక్క రజినీకాంత్ రమేష్ వివిధ యూనియన్లకు సంబంధించిన వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!