సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్
మన తొలివెలుగు, నాగర్ ర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
బిజినపల్లి మండల పరిధిలోని మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో బిజినపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ఐకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్క జొన్నల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తుందని, దీంతో రైతులు ఎటు తోచక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిని అదునుగా చూసుకున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలు 1700, నుండి 1800 రూపాయలకు మాత్రమే, కొంటున్నారని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం మక్క జొన్నలు కొనుగోలు చేస్తే గన్ని బ్యాగులు అందించడం లేదని కొనుగోలు చేసిన తర్వాత కూడా తీసుకెళ్లడానికి నాలుగు, ఐదు రోజుల సమయం పడుతుందని, రైతులు వాటి కావలి ఉండాల్సి వస్తుందని అన్నారు. అకాల వర్షాలతో తడిసిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు బోనాసి శుభాకర్, మల్లేష్, అన్నారం, కాషమ్మ, వెంకటేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
