ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సార్వత్రిక విశ్వ విద్యాలయంకి సంబంధించి డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైందని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 19 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ మదన్ మోహన్ అంబేద్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త అంజయ్య లు ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 6వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 14 నుంచి 19 వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 21 నుంచి 28 వరకు, 2వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 30 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. మరింత సమాచారం కోసం నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!