ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్గోవింద క్షేత్రానికి ఏ.సీ. బహుకరణ

గోవింద క్షేత్రానికి ఏ.సీ. బహుకరణ

📰 Generate e-Paper Clip

దాతృత్వం చాటుకున్న విద్యుత్ఉద్యోగి బి.దశరథం

 

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల(గోవింద క్షేత్రం) శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి హౌసింగ్ బోర్డ్ లోని వెంకటేశ్వర కాలనీ కమిటీ కార్యదర్శి విద్యుత్ శాఖ ఉద్యోగి బి.దశరథం, వరలక్ష్మి దంపతులు1.5 టన్నుల ఎల్.జీ ఏసీని దేవాలయానికి బుధవారం బహుకరించారు.50 వేల రూపాయల విలువగల ఏసీని దేవాలయ కమిటీ కార్యదర్శి ఏం.నాగరాజు కోశాధికారి బాలరాజు, కమిటీ సభ్యులు లక్ష్మీ నరసింహ గౌడ్, రమేష్, చారి, లక్ష్మా రెడ్డి, చిగుళ్ళపల్లి రమణకుమార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పూజారికి దేవాలయంలో అందజేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, శాలువలు తీర్థ ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న వారి కుటుంబానికి స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ సభ్యులు, గోవింద క్షేత్ర కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!