మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకొని, అభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ నాదర్ గూల్ డివిజన్-57 లోని అల్మాస్గూడ కోమటి కుంట చెరువు చుట్టూ ప్రతిరోజూ వాకింగ్‌కు వచ్చే ప్రజలు విశ్రాంతి తీసుకునే విధంగా రూ.1,20,000 విలువైన సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయించారు. అలాగే బీ ఆర్ ఆర్ కాలనీ పార్క్ లో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బెంచీలను ఏర్పాటు చేయించారు. బోయపల్లి సత్తిరెడ్డి, సత్యమ్మ , జగదీశ్వరి రామిరెడ్డి జ్ఞాపకార్థంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకొని, అభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి నాదర్ గూల్ డివిజన్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. రాజకీయాలు అంటే కేవలం పదవులు కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే అసలైన నాయకత్వమనే భావనతో ఆయన ముందుకు సాగుతున్నారని కాలనీవాసులు అంటున్నారు. ప్రజల మధ్య నిత్యం ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కి భవిష్యత్‌లో మరింత ఉన్నతమైన రాజకీయ అవకాశాలు రావాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

