ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిమహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ 

మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం క్వింటాలుకు ‘గ్రేడ్ ‘ఎ’ రకానికి రూ 2389, సాదారణ రకానికి రూ 2369, సన్న దాన్యానికి ప్రోత్సాహంగా ప్రభుత్వం క్వింటాలుకు రూ 500 లు బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దళారులకు విక్రయించవద్దని తెలిపారు , మొక్కజొన్న కందుకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మహేశ్వరం మండల మొక్కజొన్న రైతులు అక్కడికి తీసుకువెళ్లి విక్రయించాలని సూచించారు . అలాగే కొనుగోలు కేంద్రానికి రైతులు ఆధార్ కార్డు, జిల్లా కలెక్టర్ నియమించబడిన అధికారి ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్, బ్యాంక్ పాస్ పుస్తకాలు, బ్యాంకులో ఖాతా పని చేస్తున్నట్లుగా బ్యాంక్ అధికారులు నుండి ధృవీకరణ పత్రం తీసుకుని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పీ.ఏ.సీ.ఎస్ డైరెక్టర్లు, కాడమోని ప్రభాకర్ , పోల్కం బాలయ్య , నాగుల సత్యనారాయణ , ఆవుల నర్సింహా , కొండూరి నర్సమ్మ , మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్ , ఉప సర్పంచ్ జొరల రమేష్ , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్ , పోతర్ల అంబయ్య యాదవ్ , మాజీ కో- ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మంచే పవన్ యాదవ్ , కటికల పరమేష్ , ఆవులకాడి శ్రీశైలం , అయిల్ల రమేష్ గౌడ్ , చాంద్ పాషా, సీఈవో షఫీక్ , అసిస్టెంట్ సీఈఓ ఐలయ్య , విజయేందర్ , రాములు , బాబయ్య , మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!