ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిపెద్ద లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పొదుపు పునాది

పెద్ద లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పొదుపు పునాది

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

పిల్లల ఉన్నత చదువులు, వివాహం, సొంత ఇల్లు వంటి పెద్ద లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పొదుపు పునాది అని, ఆపత్కాలంలో ఆపద్బంధువుగా ఉపయోగపడుతుందని నవ కార్మిక ప్రగతి సొసైటీ సభ్యులు తెలిపారు. నవ కార్మిక ప్రగతి సొసైటీ 14వ వార్షికోత్సవాన్ని శ్రీరామ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలాపూర్ మండల పరిథిలోని శ్రీరామకాలనీ, జల్ పల్లి మున్సిపాలిటి నందు కొంత మంది యువకులతో 2012 వ సంవత్సరంలో పొదుపు సంఘాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. శ్రీరామకాలనీ, జల్ పల్లి మున్సిపల్ పరిథిలో నివసించే సభ్యులందరూ వారు సంపాదించిన డబ్బు, కుటుంబ ఖర్చులకు గాను అప్పులు, వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. శ్రీరామకాలనీ, జల్ పల్లి డివిజన్ పరిధిలోని స్వంత ఇల్లు, ఉపాథి కలిగి ఉండి 18 సంవత్సరాలు నుండి 50 సంవత్సరములలోపు వయస్సు గల సభ్యులు సంఘములో పాలకవర్గ ఆమోదముతో సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. వారు 65 సంవత్సరముల వరకు సంఘములో సభ్యులుగా కొనసాగవచ్చన్నారు. ఈ సంవత్సర 31 మార్చి 2026 నాటికి 416 మంది సభ్యులుగా ఉండి సంఘ సేవలు పొందుచున్నారని తెలిపారు. సభ్యులు తమ ఆదాయములో నుండి కొంత భాగము పొదుపు చేయడం వలన తాము వృద్దాప్యములో ఎవరి మీదా ఆధారపడకుండా తాము కూడబెట్టుకున్న పొదుపులపై ఆధారపడవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నవ కార్మిక ప్రగతి సొసైటీ ముఖ్య సలహాదారులు రాహుళగళ్ళ యాదగిరి, వ్యవస్థాపక అధ్యక్షుడు నవపేట ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ఇక్క సత్తమ్మ, చనమోని నరసింహా యాదవ్, ప్రధాన కార్యదర్శి వర్కల ఆంజనేయులు, సహాయ కార్యదర్శి బాస శంకర్, కోశాధికారి రంగం మహేష్, సహాయ కోశాధికారి పి కాశి, పాలకవర్గ సభ్యులు జోగు స్వరూప, మక్త చంద్రశేఖర్ గుత్తి రాఘవేందర్, బుడుమాల కుమార్, పొదుపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!