ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఫార్మా సిటీ వద్దు.. ఫ్యూచర్ సిటీయే ముద్దు - కేఎల్ఆర్ 

ఫార్మా సిటీ వద్దు.. ఫ్యూచర్ సిటీయే ముద్దు – కేఎల్ఆర్ 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) తీవ్రంగా ఖండించారు. తుక్కుగూడ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావుకి వారి పార్టీకి రాజకీయంగా ఫ్యూచర్ లేకపోవచ్చు కానీ తెలంగాణ యువతకు, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ వద్దు అనడం పూర్తిగా ప్రజావ్యతిరేక ధోరణి అని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ కారణంగా భూగర్భ జలాలు కలుషితమై, పరిసర గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రసాయన కాలుష్యం వల్ల అనేక గ్రామాల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తెలిపారు. కచ్చితంగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందని కేఎల్ఆర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!