ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్మహిళ అదృశ్యం 

మహిళ అదృశ్యం 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 4 సంవత్సరాల క్రితం, మనోజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవి ( 30 ) పిల్లలతో కలిసి జీవనోపాధి కోసం తన స్వస్థలం బీహార్ రాష్ట్రం నుంచి నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి శ్రీరామ్ కాలనీలో అద్దె గదిలో నివసిస్తున్నారు. ఎప్పటిలాగే మే 31వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు, వారందరూ భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. ఆ తర్వాత జూన్ 1న ఉదయం సుమారు 6 గంటలకు భర్త మేల్కొని చూడగా తన భార్య గదిలో లేదు. ఫోన్ చేస్తే ఆమె ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అని చూపిస్తోంది. దీంతో ఆమె భర్త తన భార్య కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో బంధువుల వద్ద వెతికాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. 8 నెలల క్రితం, అతని భార్య నితిన్ అనే వ్యక్తితో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ విషయమై ఆమె కనిపించకుండా పోయిందని కేసు పెట్టాడు. ఆ తర్వాత అతని భార్య తిరిగి వచ్చింది. 8 నెలల తర్వాత మళ్లీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. తన భార్య కనిపించకుండా పోవడానికి నితిన్ అనే వ్యక్తి కారణమని అనుమానిస్తూ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!