ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి - రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి – రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ఇటీవల జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో అమరవాది లక్ష్మీనారాయణ గుప్త అఖండ విజయం సాధించి మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా హస్తినాపురం జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు ఆర్యవైశ్య జిల్లా, రాష్ట్ర నాయకులు ఆయనను గజమాలతో, శాలులతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి గడ్డం వివేక్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు టి. జి వెంకటేష్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిజాయితీకి మారుపేరు నిత్యం ప్రజలకోసం పాటుపడుతూ, నిబద్ధతకు చిరునామా, ఆర్య వైశ్యుల క్రాంతి కిరణంగా పేరు తెచ్చుకున్నారని అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం రైస్ మిల్లర్స్ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం అమరవాది లక్ష్మీనారాయణ కృషి చేశారని తెలిపారు. ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ముందుండి పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. సంఘం ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో అనేక సేవా కార్య ఆర్యవైశ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఆర్యవైశ్యులు ప్రపంచవ్యాప్తంగా వాసవీ మాత పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు.

అనంతరం అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ..126 సంవత్సరాల ఘన చరిత్ర ఆర్యవైశ్యుల సంఘానికి ఉన్నదన్నారు. ప్రస్తుతం 1,65,000 మంది సభ్యత్వం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల సభ్యత్వం ఉందన్నారు. అంతకు మించి మన తెలంగాణలో సభ్యత్వాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఒక్కొక్క సభ్యుని సభ్యత్వాన్ని పెంచుకుంటూ పోవాలన్నారు. 40 లక్షలు పెంచితే మనకు రెండు లక్షల సభ్యత్వం ఆంధ్ర ప్రదేశ్ తో ధీటుగా ఉంటుందన్నారు. ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్యులకు భవనాన్ని నిర్మాణం చేయబోతున్నామన్నారు. బీదవాళ్లకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆర్య వైశ్యులు నిస్వార్ధంగా సేవ చేస్తారన్నారు .ప్రజాసేవ కట్టుబడి ఉంటారన్నారు. మనందరం ఐక్యంగా ఉండి రాజకీయంగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!