మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) చైర్మెన్ బావండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఐడిఓసీ కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర టీజీఈ జేఏసీ మే 5వ తేదీన ఉద్యోగులకు సంబంధించి 64 డిమాండ్ల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షకు నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహక సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు నెరవేరేవరకు ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ సభ్యులు తెలియజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కు, ఐడిఓసి కార్యాలయం ముందు భాగంలో మే 5వ తేదీన మంగళవారం నాడు ఉదయం 10:30 నుండి సాయంత్రం వరకు నాగర్ కర్నూల్ లో నిర్వహించే ఒకరోజు నిరాహార దీక్షకు జిల్లా జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో నోటీసు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ అడిషనల్ సెక్రెటరీ జనరల్ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎండి షర్ఫుద్దీన్, కో చైర్మన్లు కే శ్రీధర్ రావు, సిహెచ్ వెంకటప్ప, భగవేనీ నరసింహ, లక్ష్మీ నరసింహారావు, వివిధ సంఘాల సభ్యులు లక్ష్మీనారాయణ, గోదా రాజు, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యూనస్, మలిపెద్ది సురేష్ కుమార్, జీ.కే. వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
