జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.రవికుమార్
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
జిల్లా లోని ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల్లో శారీరిక, మానసిక అభివృద్ధిలోని లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వెంటనే తగిన చికిత్స అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ తెలిపారు. ఆర్.బి.ఎస్.కే సంచార వైద్య బృందాల ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను పరీక్షించి, అంగవైకల్యం మానసిక, శారీరక పెరుగుదలలో లోపాలను, ఆలస్యాలను గుర్తించే ప్రత్యేక శిబిరాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బాలభరోసా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ & జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వైద్య నిపుణులు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ సిరాజుద్దీన్, డాక్టర్ నాజీమోద్దీన్ ఎంపిక చేసిన 16 మంది చిన్నారులను పరీక్షించారు. తదనంతరం చిన్నారులకు కోసం అవసరమైన సేవల గురించి పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి,సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్,డాక్టర్ రోహిత్,ఆర్బి.ఎస్ కే వైద్యులు డాక్టర్ సురేష్,డాక్టర్ అక్బర్ దురాని,సిపిఓ శ్రీశైలం, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ, సి.హెచ్.ఓ వై.శ్రీనువాసులు, సురేష్ కుమార్, కళ్యాణ్ కృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
