బౌరంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బౌరంపేట్ గ్రామం బొడ్రాయి సర్కిల్ లో మహా ధర్నా
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట గ్రామంలో నెలకొన్న తీవ్రమైన డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బౌరంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బౌరంపేట్ గ్రామం బొడ్రాయి సర్కిల్ లో మహా ధర్నా జరిగింది. గత రెండు సంవత్సరాలుగా బౌరంపేట పరిధి డ్రైనేజీ సమస్య 1. ఎస్సీ బస్తీ పోచమ్మ గుడి, 2. మల్లన్న కుంట కమాన్, 3. చాకలి మన్నెమ్మ ఆకులపాడు ఇంటి మధ్య రోడ్డు, 4. ఇందిరమ్మ కాలనీ ఇండ్ల మధ్యలో, 5. ఆర్ కే ఫస్ట్ ఫేస్ లో వివిధ ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగిపొర్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇళ్లలో పాచి పని చేసుకునే పేదలు రోజు పని చేసుకుంటే గాని పొట్ట గడవలేని పరిస్థితి ఇంటి ముందు నుంచి విపరీతమైన దుర్వాసనతో పొంగిపొర్లుతుంటే ఆవాసనకు కడుపుకు నాలుగు మెతుకులు సంతృప్తిగా భోజనం చేయని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేనిస్థితి అని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు సంవత్సరంల నుంచి ప్రజాప్రతినిదులు లేని పాలన వ్యవస్థ వారి అలసత్వానికి అధికారులను మేలుకోల్పడానికి సమస్య శాశ్వత పరిష్కారానికి బౌరంపేట గ్రామ ప్రజలతో కలిసి బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు గోనె మల్లారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, నర్సింహా చారి, కొమ్ము ప్రశాంత్, బాలగారి శ్రీకాంత్, దుగురు సత్యనారాయణ, వినోద్,మల్లేష్ మహిళలు పాల్గొన్నారు.

