ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్శ్రీ విజయ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు 

శ్రీ విజయ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని చింతల్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ గణపతి దేవాలయ మండల పూజ కార్యక్రమాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన స్థానిక ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పూజారులు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుచ్చి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు దాస్ గౌడ్, విశాల్, అనిల్ కుమార్, బుచ్చిరెడ్డి, క్రాంతి కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!