60 దొంగతనాల్లో ఆరితేరిన గజదొంగ బాలాపూర్ పోలీసులకు చిక్కాడు
మన తొలివెలుగు : మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు ఆ దొంగ పండుగ చేసుకుంటాడు. 14 తులాల బంగారం చోరీ కేసును ఎట్టకేలకు బాలాపూర్ పోలీసులు చేదించారు. ఆ చోరుడు 60 దొంగతనాల్లో సిద్ధహస్తుడు. కానీ విధి వక్రీకరించి ఓ ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. అనంతరం అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి దొంగతనాలలో సిద్ధహస్తుడైన హబీబ్ మహమ్మద్ అలియాస్ చోటు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ లో నివాసం ఉంటున్నాడు. గత నెల ఏప్రిల్ 14 న పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రీమ్ లేక్ కాలనీ లో 14 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం జరిగినట్లు కంప్లైంట్ రావడం తో డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరావుతో కలిసి రెండు టీం లు ఏర్పాటు చేశాం. టెక్నికల్ గా సీసీ కెమెరాలు వెతికాం. అలాగే గతంలో దొంగతనాలు చేసిన వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి దర్యాప్తు చేపట్టాము. ఆ సస్పెక్ట్ లలో సిద్ధహస్తుడు పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ ప్రాంతానికి చెందిన హబీబ్ మహమ్మద్(37) అలియాస్ చోటు ప్లంబర్ పని చేస్తుంటాడు. ఈ నెల 29న షాహీనగర్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న హబీబ్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా దొంగతనం చేసి నట్లు ఒప్పుకున్నాడు.

మొత్తం రికవరీ అంటే 14 తులాల బంగారం విలువ రూ. 20 లక్షల పై గా ఉంటుంది. హబీబ్ తో పాటు చోరీ చేసిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన మహమ్మద్ హుస్సేన్(36) ఎలక్ట్రిషన్ పనిచేస్తుంటాడు. అతని దగ్గర ఒక చైన్ రికవరీ చేశాం . హబీబ్ ఇతనికి చైన్ ఇచ్చి 18 వేలు తీసుకొన్నట్లు తెలిసింది. హబీబ్ మహమ్మద్ పై బాలాపూర్, పహడీషరీఫ్, చాంద్రాయణగుట్ట , తప్పాజిపుత్ర తదితర పోలీస్ స్టేషన్లలో 60 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతను నుండి నేరానికి ఉపయోగించిన బైకును, ఇంటి తాళం పగలగొట్టేందుకు ఉపయోగించిన రెండు ఇనుపరాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ దొంగ ను పట్టుకొన్నందుకు ఆదిభట్ల ఏసీపీ బాలాపూర్ పోలీసులను అభినందించారు.

