ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ప్రజలపై అధిక భారం పడుతున్న ప్రాపర్టీ టాక్స్‌లను తగ్గించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్‌పేట్, మీర్‌పేట్, ప్రాంతాలలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు , వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలపై అధిక భారం పడుతున్న ప్రాపర్టీ టాక్స్‌లను తగ్గించాలని కోరారు. అలాగే బడంగ్‌పేట్ ప్రాంతంలో 33 కేవీ హై టెన్షన్ లైన్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పేద ప్రజల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని, బలాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అల్మాస్‌గూడ ప్రాంతంలో కన్వర్షన్ గ్రీన్ జోన్ రెసిడెన్షియల్ జోన్‌కు సంబంధించిన హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా స్లమ్ ప్రాంతాలలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఉచిత మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు సంబంధించిన ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామిడి రామిరెడ్డి, అరకల కామేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహన్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, సునీత బాలరాజ్, దిండు భూపేష్ గౌడ్, సిద్దాల బీరప్ప, సిద్ధాల అంజయ్య , గడ్డం లక్ష్మన్ ముదిరాజ్, మాదిరి రమేష్ ,దయానంద్ ముదిరాజ్, సోషల్ మీడియా ఇన్చార్జి సిల్వర్ సాంబశివ, మీర్‌పేట్ కాలనీల అసోసియేషన్ సభ్యులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!