మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మత సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో రాబోయే బక్రీద్ పండుగను జరుపుకోవాలని మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మహేశ్వరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మహేశ్వరం మండల ముస్లిం మత పెద్దలతో, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహేశ్వరం మండల వివిధ గ్రామాల ముస్లిం నాయకులతో సమావేశం నిర్వహించి పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, ప్రసాద్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, బక్రీద్ పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గం అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ సమీర్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా, నాగారం గ్రామ సర్పంచ్ లింగం ముదిరాజ్, నందు పల్లి గ్రామ ఉప సర్పంచ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఎజాస్ , నాగారం గ్రామ పంచాయతీ సభ్యుడు మొహమ్మద్ షాబుద్దీన్ ఖాన్, మొహమ్మద్ నయీమ్ ఖాన్ , మాజీ ఉప సర్పంచ్ మహమ్మద్ లతీఫ్ ఖాన్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ మహేశ్వరం మండల అధ్యక్షుడు మహమ్మద్ కమల్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అన్వర్ ఖాన్ మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ జలాలుద్దీన్, మహేశ్వరం గ్రామ ముస్లిం పెద్దలు షేక్ ఇబ్రహీం, మహమ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ జాంగిర్ ఖురేషి. గట్టుపల్లి ముస్లిం సొసైటీ నాయకుడు మొహమ్మద్ ఖయ్యూం, ఉపాధ్యక్షుడు మహమ్మద్ మహమూద్, మహమ్మద్ ఉమర్, దుబ్బచర్ల ముస్లిం సొసైటీ సభ్యులు సయ్యద్ రిజ్వాన్, మహమ్మద్ రావుఫ్.మ, అమీర్పేట్ ముస్లిం సొసైటీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మిస్కిన్, సభ్యులు వాజిద్, నాగారం గ్రామ ముస్లిం సొసైటీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్, నాయకులు మొహమ్మద్ అంజద్ ఖాన్, మమ్మద్ ముక్తార్ ఖాన్, మహమ్మద్ చాంద్. షేక్ అమిరుద్దీన్, షేక్ ఖాజా, మొహమ్మద్ అన్వర్ ఖాన్, మొహమ్మద్ జాకీర్, నందు పల్లి గ్రామ ముస్లిం సొసైటీ నాయకులు మొహమ్మద్ ఖలీల్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా, మొహమ్మద్ ఆరిఫ్ పాషా.మ, తదితరులు పాల్గొన్నారు.పీస్ మీటింగ్ లో హాజరైన మహేశ్వరం పోలీస్ అధికారులకు ఘనంగా సన్మానించారు.

