ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిపసిపాప నువ్వులతో, వెండి వెన్నెల వెలుగులో, చక్కని చిరునవ్వు సాక్షిగా ఘనంగా శ్రీయాన్స్ నాయక్ పుట్టినరోజు...

పసిపాప నువ్వులతో, వెండి వెన్నెల వెలుగులో, చక్కని చిరునవ్వు సాక్షిగా ఘనంగా శ్రీయాన్స్ నాయక్ పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

దేవుని ఆశీస్సులతో, తల్లిదండ్రుల దీవెనలతో, అలుపు లేని అల్లర్ల ఆనందంలో, కనువిందు చేసే బంధాల మధ్యలో, చిరునవ్వు సాక్ష్యంగా శ్రీయాన్స్ నాయక్ కలలు, కోరికలు నెరవేరాలని పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరు బాబుని దీవించారు. పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే చాలా మందికి ఎంతో స్పెషల్ డే కాబట్టి బాలు నాయక్, సరిత దంపతుల ముద్దుల కుమారుడు శ్రీయాన్స్ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఇంజాపూర్ లో ఆయన నివాసం ఉండే ఇంటి ఆవరణలో శ్రీయాన్స్ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కంపెనీలో పనిచేసే తోటి కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, అభిమానులు శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, బాబు అభిమానులైన చిన్నారులు విచ్చేసి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ఎల్లప్పుడూ నవ్వుతూ, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోటి కాంతుల చిరునవ్వులతో, భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో నానమ్మ తాత మళ్లీ సీమ, అమ్మమ్మ తాత జమ్మూ పత్య, అత్త మామ జే. మంజుల రవి, స్కూప్స్ కంపెనీ హెచ్ఆర్ రాజన్, వినయ్ కుమార్, స్వామి, పావని , ఎం. శ్రీకాంత్ రెడ్డి , చంద్ర కిశోర్ (మంటు), ఎం.సరస్వతి, శ్రీనివాస్, క్రిష్ణ, రషీద్, సి ఎచ్ రవి ,తులసి రామ్, సి.చందు , అనిల్, బి. వెంకన్న ,బి. సుమన్ ఉమేందర్, అశోక్, ముత్తయ్య ముదిరాజ్, రాజేశ్వరి , బాలు నాయక్ తోటి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!