మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ప్లాస్టిక్ కవర్స్ గోదాం లో మంటలు అంటుకొని దాని పక్కన ఉన్న బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్ కు కూడా మంటలు అంటుకొని కాలిపోయాయి. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొత్తపేట నుండి మల్లాపూర్ వెళ్లే దారిలో గాలిబ్ కాలనీ లో ఒక ప్లాస్టిక్ కవర్స్ గోదాం లో మంటలు అంటుకొని దాని పక్కన ఉన్న బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్( అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్( కు కూడా మంటలు అంటుకొని కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు అక్కడికి వెళ్లి ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట ఫైర్ స్టేషన్ నుండి 3 ఫైర్ ఇంజన్లతో బాలాపూర్ పోలీసులు మంటలను ఆర్పివేశారు, అత్తర్ బేకరీ ప్రొడక్ట్స్ యజమాని సయ్యద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లింది. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం కాలేదని పోలీసులు తెలిపారు.

