గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ
సీపీఎం జిల్లా కార్యదర్శివర్ధన్ పర్వతాలు
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
నరేంద్ర మోడీ మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గ్యాస్ ధరల భారాన్ని ప్రజలపై మోపుతూ సామాన్యుల నడ్డివిడుస్తున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు అన్నారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కట్టెల పొయ్యి ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మూడోసారి ప్రజలపై గ్యాస్ ధరల పెంపుతో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పూర్తిగా విచ్ఛిన్నం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ముందు గ్యాస్ ధరలు పెంచకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు1000 రూపాయలకు పెంచి ప్రజలను చిన్న చిన్న హోటల్లు నడుపుకునే వాళ్ల వారి యొక్క జీవన ప్రమాణాలపై గ్యాస్ గుదిబండ వేసి వారి జీవితాలను చిద్రం చేశారని ఆయన అన్నారు. మళ్లీ దేశంలో ఉన్న ప్రజలు కట్టెల పొయ్యి వాడే స్థితికి మోడీ తీసుకువచ్చారని ఆయన అన్నారు. దేశంలో చమురు కంపెనీలకు స్వతంత్ర స్వేచ్ఛ ఇవ్వడం వలన వారికి ఇష్టం వచ్చిన రీతిలో వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఇది ఏమి తమకు సంబంధం లేదు అన్నట్లుగా మోడీ ప్రభుత్వం బడ పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు మేలు చేకూర్చే విధంగా మోడీ విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజలను నమ్మించడానికి యుద్ధం పేరుతో గ్యాస్ ధరలు పెంచి ప్రజల యొక్క ఆలోచనలు తప్పుదారి పట్టించారని ఆయన అన్నారు. మరొకవైపు దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత పెట్రోల్ పై నాలుగు రూపాయలు డీజిల్ పై ఐదు రూపాయల పెంపు ఉంటుందని ముందుగానే సంకేతాలు ఇవ్వడం ప్రజల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా దేశ ప్రజలు మోడీ యొక్క విధానాలు ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించాలని ఆయన అన్నారు మోడీ అధికారంలోకి రాకముందు 500 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఏకంగా మూడు వేలకు పెంచడం అంటే మోడీ యొక్క నిరంకుశ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కేవలం హిందుత్వ ఎజెండా తో సుదీర్ఘకాలం అధికారంలో ఉంటామని కలలు కనడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు.ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందికొండ గీత, జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య జిల్లా నాయకులు సత్యనారాయణ మల్లికార్జున్ బంగారయ్య లక్ష్మయ్య కాజా నరసింహ, ముర్తుజ, సిద్దు, శిరీష, లక్ష్మి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

