మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని మహేశ్వరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి , మాజీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో సుదీర్ఘంగా సబితా ఇంద్రారెడ్డితో నియోజకవర్గంలో అభివృద్ధి , సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కులంకుశంగా చర్చించారు . వారి విన్నపాన్ని అభ్యర్థనను సందేశాన్ని పురస్కరించుకొని సబితా ఇంద్రారెడ్డి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఇరువురు నాయకులను ఎమ్మెల్యే కోరారు.

