ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఫలక్ నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

ఫలక్ నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్

ఫలక్‌నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ కే. ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఉన్నత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డా. వెలగపూడి సుహాసిని, డా. బాబు రావు, విద్యార్థులు: 1వ, 3వ మరియు 5వ సెమిస్టర్‌లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సహచర విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. అధ్యాపకులు, పీహెచ్‌డీ పూర్తి చేసిన అధ్యాపకులను సన్మానించారు, డా. వెలగపూడి సుహాసిని, డా. ఎల్. శశికళ, పీ హెచ్‌ డీ నమోదు చేసుకున్న అజార్ మరియు ఆస్మాలను కూడా అభినందించారు. అడ్మిషన్ల ప్రక్రియ- 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెగా పేరెంట్ మరియు టీచర్స్ మీటింగ్ లో తల్లిదండ్రులు అధ్యాపకుల మధ్య విద్యార్థుల అభివృద్ధి, విద్యా ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలపై చర్చించేందుకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. కోర్సుల వివరాలు ముఖ్యంగా భౌతిక శాస్త్రాలు, జీవ విజ్ఞానం వంటి వివిధ విభాగాల్లో ఉన్న అవకాశాలను, అలాగే కళాశాలలో అందుబాటులో ఉన్న వసతులను ప్రిన్సిపాల్ వివరించారు. ప్రభుత్వ పథకాలు, ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు “ప్రజాపాలన” ద్వారా అందుతున్న విద్యా ప్రయోజనాలపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి, విద్యార్థులు కేవలం డిగ్రీ తో ఆగకుండా, జిజ్ఞా వంటి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుల ద్వారా పరిశోధనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. భౌతిక శాస్త్ర విద్యార్థుల కోసం లైవ్ ప్రాజెక్టులు కూడా చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!