ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంరాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం 

📰 Generate e-Paper Clip

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది

ప్రజా సౌకర్యాలే ప్రాధాన్యం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

కాలనీలు, నివాస ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతానికి మంచి గుర్తింపు లభిస్తుందని , ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం తన ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, జిల్లెలగూడ డివిజన్‌లలో సుమారు రూ.1.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నియోజకవర్గాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే వినియోగించబడేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అంతేకాకుండా, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలనీలలో ఎలాంటి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో పరిశీలించి, చెత్తాచెదారం, పూడిక వ్యర్థాలను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో అర్కల కామేష్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, దిండు భూపేష్ గౌడ్, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, బొక్క రాజేందర్ రెడ్డి, సిద్దాల బీరప్ప, సిద్దాల చిన్న బీరప్ప, బొమ్మరగోని యాదగిరి, లక్ష్మణ్ ముదిరాజ్, జయేందర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, సిద్దాల అంజయ్య, మదారి రమేష్, విజయ్, గోపి యాదవ్, ప్రవీణ్ రెడ్డి, సునీత బాలరాజ్, లలిత జగన్, బిందు , పంతంగి మాధవి, సుర్విలత శేఖర్ గౌడ్, జ్ఞానేశ్వర చారి, దోనూరి శ్రీనివాస్ రెడ్డి, న్యూ గాయత్రి వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సి. ప్రభాకర్ రావు, ప్రెసిడెంట్ సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్, జాయింట్ సెక్రెటరీ వై.కె.పి వి. ఆర్ కుమార్, ఆర్గనైజర్ సెక్రెటరీ ఎన్. వీరారాజు, ట్రెజరర్ వి. విజయకుమార్, సుదర్శన్ , అసోసియేషన్ సభ్యులు , కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!