ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంసీఎం రేవంత్ రెడ్డి సభను జయప్రదం చేయండి

సీఎం రేవంత్ రెడ్డి సభను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

పార్టీ శ్రేణులకు కేఎల్ఆర్ లుపు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ఫ్యూచర్ సిటీలో ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. మహేశ్వరం మండలం నాయకులతో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మహేశ్వరం మండలం లోని కాకి ఈశ్వర ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమీర్ పేట్ గ్రామం నుంచి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్సాన్‌పల్లి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీటింగ్ కు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, పీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన సమీకరణపై నేతలతో కిచ్చన్న చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్శిటీ భవనాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి దాదాపు 30 వేల మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులందరినీ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ప్రాంతానికి, మన మహేశ్వరం నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సి.హెచ్ యాదయ్య, ఆవుల యాదయ్య, గ్రామ ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షుడు ఆవుల రఘుపతి, వర్కల యాదగిరి గౌడ్, బస్వా యాదయ్య గౌడ్, తొంట లక్ష్మీ ప్రసాద్, కడల భాస్కర్, నీగోళ్ళ బాల్ రాజ్, వార్డు సభ్యులు డప్పు జనార్ధన్, ఎండి షఫీ, గల్లా అనిల్, వంశీ గౌడ్, కంది వినయ్, బాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!