ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్సుందరీకరణ పేరుతో పచ్చని మొక్కలను చంపుతారా..?

సుందరీకరణ పేరుతో పచ్చని మొక్కలను చంపుతారా..?

📰 Generate e-Paper Clip

నిజాంపేట్ సర్కిల్ బీజేపీ నాయకులు ఆకుల సతీష్

మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్

నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్డులో డివైడర్ల బ్యూటిఫికేషన్ పేరుతో ఇప్పటికే పచ్చగా పెరిగిన మొక్కలను తొలగించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని నిజాంపేట్ సర్కిల్ బీజేపీ నాయకులు ఆకుల సతీష్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజలకు ఆక్సిజన్ అందించే, పర్యావరణాన్ని కాపాడే పచ్చని మొక్కలను సంరక్షించాల్సిన అధికారులు వాటిని తొలగించి మళ్లీ కొత్త మొక్కలు నాటడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే పెరిగిన మొక్కలను చంపి, మళ్లీ అదే తరహా మొక్కల కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం సమంజసం కాదన్నారు. అలాగే పార్కుల్లో ఉన్న మౌలిక వసతులను తొలగించి తిరిగి ఏర్పాటు చేయడం ప్రజల పన్నుల డబ్బును దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీఎంసీ కమిషనర్ వెంటనే విచారణ జరిపి, బడి యు జి డి డిపార్ట్మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ప్రజా నిధులను అవసరమైన అభివృద్ధి పనులకు వినియోగించాలని, పచ్చదనాన్ని కాపాడాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!