ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంకాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు తోట అరవింద్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు తోట అరవింద్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాదర్ గూల్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు తోట అరవింద్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డికి కేఎల్ఆర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా తోట అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రగతికి ఆకర్షితుడినై కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించారు. మరీ ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో కేఎల్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి, తాను బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నాదర్ గూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెత్తుల ఆనంద్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్, సీనియర్ నాయకులు బంగారి అశోక్, మర్రి శశాంక్ రెడ్డి, గడ్డం చిన్న, కుమార్, నర్సింగ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!